Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలంగాణలో దసరా సెలవులు ఖరారు.. పాఠశాలలకు 13 రోజులు, కాలేజీలకు 12 రోజులు

Telangana Dasara holidays confirmed 13 days for schools and 12 days for colleges
Advertisement
  • పాఠశాలలకు అక్టోబర్ 10 నుంచి 22 వరకు మొత్తం 13 రోజుల సెలవులు
  • జూనియర్ కాలేజీలకు అక్టోబర్ 10 నుంచి 21 వరకు 12 రోజుల పాటు సెలవులు
  • అక్టోబర్ 23న స్కూళ్లు, 22న కాలేజీలు తిరిగి పునఃప్రారంభం
  • సెలవులకు ముందు రోజే ముగియనున్న సమ్మెటివ్-1 పరీక్షలు
Advertisement
తెలంగాణలోని విద్యార్థులకు దసరా పండుగ సెలవులను రాష్ట్ర విద్యాశాఖ ఖరారు చేసింది. 2026 విద్యా సంవత్సరానికి గాను పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు వేర్వేరుగా సెలవుల తేదీలను శనివారం ప్రకటించింది. ఈసారి పాఠశాలలకు 13 రోజుల పాటు, ఇంటర్మీడియట్ కళాశాలలకు 12 రోజుల పాటు దసరా సెలవులు రానున్నాయి.

విద్యాశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు అక్టోబర్ 10 నుంచి 22వ తేదీ వరకు 13 రోజుల పాటు సెలవులు ఉంటాయి. సెలవుల అనంతరం అక్టోబర్ 23న పాఠశాలలు తిరిగి తెరుచుకుంటాయి.

ఇక జూనియర్ కళాశాలల (ఇంటర్మీడియట్) విద్యార్థులకు అక్టోబర్ 10 నుంచి 21వ తేదీ వరకు మొత్తం 12 రోజులు సెలవులు ప్రకటించారు. వీరికి అక్టోబర్ 22న తిరిగి తరగతులు ప్రారంభమవుతాయి.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో సమ్మెటివ్ అసెస్‌మెంట్-1 (SA-1) పరీక్షలు జరుగుతున్నాయి. ఈ పరీక్షలు అక్టోబర్ 9వ తేదీతో ముగియనున్నాయి. అదే రోజున జరగాల్సిన 9వ తరగతి ఇంగ్లీష్ పరీక్ష సమయాన్ని అధికారులు మార్చారు. ఈ పరీక్ష ఉదయం 9:15 గంటల నుంచి మధ్యాహ్నం 12:15 గంటల వరకు జరుగుతుందని విద్యాశాఖ స్పష్టం చేసింది. పరీక్షలు ముగిసిన మరుసటి రోజు నుంచే విద్యార్థులకు దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి.
Advertisement
Advertisement
Telangana Education Department
Dasara holidays 2026
Telangana school holidays
Telangana junior college holidays
Telangana Dasara vacation dates
SA 1 exams Telangana

More Telugu News